మునుగోడులో జగదీశ్ రెడ్డి ప్రచారం చేయొద్దు: ఈసీ
మునుగోడులో మంత్రి జగదీశ్ రెడ్డి ఎన్నికల ప్రచారం చేయకుండా కేంద్ర ఎన్నికల సంఘం నిషేధం విధించింది. రానున్న 48 గంటల పాటు జగదీశ్ రెడ్డి ప్రచారానికి దూరంగా ఉండాలంటూ ఈసీ సంచలన ఉత్తర్వులు జారీ చేసింది. అంటే శనివారం సాయంత్రం 7 గంటల నుంచి సోమవారం సాయంత్రం 7 గంటల వరకు జగదీశ్ రెడ్డి ప్రచారానికి దూరంగా ఉండాలన్నమాట. బహిరంగ సభలు, ప్రదర్శనలు, ర్యాలీలు, రోడ్ షోలల్లో జగదీశ్ రెడ్డి పాల్గొనరాదని, ఇంటర్వ్యూలు కూడా ఇవ్వరాదని ఈసీ స్పష్టం చేసింది. ఎన్నికల నియమావళిని ఉల్లంఘించినందుకు మంత్రిపై చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపింది.

