Home Page SliderTelangana

‘టిల్లూ స్క్వేర్’ నుండి ‘టికెట్ కొనకుండా’ సాంగ్ విడుదల

‘డీజే టిల్లూ’ సూపర్ హిట్ కావడంతో మరోసారి ‘టిల్లూ స్క్వేర్‌’తో వస్తున్నాడు యంగ్ హీరో సిద్దూ జొన్నలగడ్డ. ‘టిల్లూ స్క్వేర్’ నుండి టికెట్ కొనకుండా అంటూ సాగే పాట నేడు విడుదలయ్యింది. ఈ పాటను కాసర్ల శ్యామ్ రచించగా, విలక్షణ గాయకుడు రామ్ మిర్యాల ఈ పాటను పాడారు. రామ్ మిర్యాల పాడిన ‘డీజే టిల్లూ’ అనే టైటిల్ సాంగ్ డీజే టిల్లూ చిత్ర విజయానికి ఎంతో తోర్పడిన సంగతి తెలిసిందే. ఈ సెంటిమెంట్‌ను రిపీట్ చేస్తూ, ఈ పాటను కూడా అదే గాయకుడితో పాడించారు చిత్రబృందం.  ఈ చిత్రంలో సిద్దూకు జోడీగా అందాల అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్‌గా నటిస్తుండడంతో ఈ చిత్రంపై ఇప్పటికే అభిమానుల అంచనాలు భారీగా ఉన్నాయి. మల్లిక్ రామ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.