వాళ్లను మా రాష్ట్రంలో దించొద్దు
అమెరికాలో ఉన్న అక్రమ వలసదారులను దశలవారీగా ఆదేశ ప్రభుత్వం ఇండియాకు పంపుతుంది.అది కూడా ఎంతో గౌరవంగా పంపుతుంది. అక్రమ వలసదారులపై ఎలాంటి శిక్షలు విధించకుండానే పంపుతుంది.విమానాల్లో ఎంచక్కా ఇండియాకు సురక్షితంగా పంపుతుంది.అయితే ఈ నేపథ్యంలో యూఎస్ నుంచి వచ్చే విమానాలు పంజాబ్ రాష్ట్రంలోని అమృత్ సర్ లో నే ల్యాండ్ అవుతున్నాయి.దీంతో పంజాబ్ సర్కార్…కేంద్రంపై నిప్పులుచెరుగుతోంది. దురుద్దేశ్యపూర్వకంగానే తమ రాష్ట్రంలో ఇలాంటి అక్రమ వలసదారుల విమానాలు దించి తమ రాష్ట్ర పరువు తీస్తున్నారని మండిపడుతుంది.ఇవాళ 119 తో కూడిన మరో విమానం రానుంది. కావాలనే విమానాలను అమృత్సర్లో దించుతున్నారని సీఎం భగవంత్ మాన్ సింగ్ ఆరోపించారు.కేంద్రం ఈ విషయంలో పునరాలోచించుకోవాలని లేనిపక్షంలో తాము తీసుకోవాల్సిన నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు.