బొద్దుగా ఉండొద్దు.. సన్నగానే ముద్దు..!
ఇటీవల కాలంలో ధనిక, పేద అని తేడా లేకుండా ప్రతి ఒక్కరి ఆహారపు అలవాట్లలో మార్పులు వచ్చాయి. ప్రధానంగా మార్కెట్‌లో బేకరీ, జంక్‌ఫుడ్ అమ్మకాలు అధికంగా ఉన్నాయి. ఈ జంక్‌ఫుడ్ తినే వారిలో అత్యధిక మంది చిన్నారులే ఉండటం గమనార్హం. దీంతో అనేకమంది చిన్నారులు ఊబకాయం బారిన పడుతున్నారు. ఊబకాయం సమస్యను చిన్నతనంలోనే అధిగమించకపోతే ప్రాణాంతకంగా మారే ప్రమాదం సైతం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

