Home Page SliderTelangana

కేంద్ర బడ్జెట్ లో తెలంగాణకు గాడిద గుడ్డు

కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ వరుసగా 8వసారి బడ్జెట్ ప్రవేశపెట్టారు. కేంద్ర బడ్జెట్ లో తెలంగాణకు తీరని అన్యాయం జరిగిందన్నారు టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు. నిర్మలా సీతారామన్ తెలుగు కోడలైనా కాని.. తెలంగాణపై ప్రేమ చూపలేదన్నారు. ఈ బడ్జెట్ కేవలం బీహార్ ఎన్నికల కోసమేనంటూ.. అందుకే బీహార్ నజరానాలు ప్రకటించారని మహేహ్ కుమార్ గౌడ్ తెలిపారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం తెలంగాణపై వివక్ష చూపుతుందని.. రాజకీయంగా తెలంగాణను దెబ్బతీయాలని చూస్తుందని టీపీసీసీ చీఫ్ తెలిపారు. 50.65 లక్షల కోట్ల బడ్జెట్ ప్రవేశ పెట్టిన కేంద్రం తెలంగాణ ఒక్క పైసా కూడా ఎందుకు కేటాయించలేదని ప్రశ్నించారు. నిర్మలమ్మ తన బడ్జెట్ ప్రసంగంలో గురజాడ అప్పారావు గారి దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులోయ్ అన్న పదాలను వాడారు.. మరి తెలంగాణ ప్రజలు దేశంలో మనుషులు కారా.. అని నిర్మలమ్మను సూటిగా ప్రశ్నించారు. తెలంగాణ కు ఎన్నికల సమయంలో ప్రధాని మంత్రి, బీజేపీ నాయకులు ఇచ్చిన హామీలను గాలికొదిలేశారన్నారు. సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు ప్రధాన మంత్రిని కలిసి తెలంగాణ కు రావాల్సిన అనేక అంశాలపై విజ్ఞప్తి చేసినా.. బీజేపీ మాత్రం స్వార్థ పూరితంగా వ్యవహరించిందన్నారు.