పోర్న్‌స్టార్ కేసులో గెలిచిన డొనాల్డ్ ట్రంప్
ఎట్టకేలకు పోర్న్‌స్టార్ స్టోర్మీ డేనియల్స్ దాఖలు చేసిన కేసులో ట్రంప్ విజయం సాధించారు. ట్రంప్‌పై పరువు నష్టం కేసు వేసింది డేనియల్స్. ఆమె ఆరోపణలు ఖండిస్తూ ట్రంప్ ట్వీట్ చేయగా, ఆమె ఈ కేసు వేశారు. ఇప్పటికే ఒక కేసు విషయంలో ట్రంప్ లాయర్లకు ఆమె 5 లక్షల డాలర్లు చెల్లించింది. ఇప్పుడు ఈ కేసులో ట్రంప్ లీగల్ బృందానికి లక్షా 21 వేల డాలర్లు చెల్లించమంటూ కాలిఫోర్నియా సర్క్యూట్ కోర్టు ఆదేశించింది.