లాభాల్లో ముగిసిన దేశీయ మార్కెట్లు
శుక్రవారం కూడా దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు లాభాల్లో ముగిశాయి. ఉదయం 82,075.45 వద్ద ప్రారంభమైన సూచీ ఒక దశలో 82,072.93 కనిష్ఠానికి పడిపోయింది. ఆ తర్వాత ఇంట్రాడేలో 328.72 పాయింట్లు పెరిగి 82,500.82 వద్ద స్థిరపడింది. ఇక నిఫ్టీ 106.60 పాయింట్లు పెరిగి 25,288.40కి చేరింది. రూపాయి మారకం విలువ డాలర్ తో పోలిస్తే 88.80 వద్ద ఉంది. నిఫ్టీ సూచీలో సిప్లా, ఎస్‌బీఐ, మారుతీ సుజుకీ, డాక్టర్ రెడ్డీ ల్యాబ్స్, అదానీ పోర్ట్స్ షేర్లు లాభాలు నమోదు చేశాయి. టాటా స్టీల్, టీసీఎస్, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్, టెక్ మహీంద్రా, జేఎస్‌డబ్ల్యూ షేర్లు నష్టాల్లో ముగిశాయి. లోహ రంగంలో క్షీణత నమోదవగా.. ఆటో, కన్జూమర్ డ్యూరబుల్స్, పీఎస్ యూ బ్యాంకులు, రియాల్టీ, ఫార్మా రంగాల్లో వృద్ధి కనిపించింది. సెన్సెక్స్ 320 పాయింట్లకు పైగా పెరగ్గా.. నిఫ్టీ 106 పాయింట్ల మేర వృద్ధి నమోదు చేసింది.