Breaking NewsHome Page SliderTelangana

బ‌లిదేవ‌త తెచ్చిన చ‌ట్టాన్ని అమ‌లు చేసే ద‌మ్ముందా రేవంత్‌?

టిడిపిలో ఉన్న‌ప్పుడు అప్ప‌టి ఏఐసిసి అధ్య‌క్షురాలు, మాజీ యూపిఏ ఛైర్‌ప‌ర్శ‌న్ సోనియాగాంధీని బ‌లిదేవ‌తని,దెయ్య‌మ‌ని ఇలా అనరాని మాట‌లు అన్న నేటి సీఎం రేవంత్ రెడ్డి..ఇప్పుడ‌దే సోనియా కాళ్లు క‌డిగి నెత్తిన నీళ్లు చ‌ల్లుకుంటున్నాడ‌ని మాజీ మంత్రి ,ఎమ్మెల్యే హ‌రీష్ రావు ధ్వ‌జ‌మెత్తారు. పార్టీ కార్యాల‌యంలో గురువారం నిర్వ‌హించిన విలేక‌రుల స‌మావేశంలో ఆయ‌న మాట్లాడారు. సీఎం రేవంత్ కి ద‌మ్మంటే, సోనియాపై ఏ మాత్రం గౌర‌వాభిమానాలున్నా…ఆమె తెచ్చిన 2013 నాటి భూసేక‌ర‌ణ చ‌ట్టాన్ని యుద్ద‌ప్రాతిప‌దిక‌న అమ‌లు చేయాల‌ని డిమాండ్ చేశారు.తెలంగాణ ప్ర‌జ‌ల‌ను మ‌భ్య‌పెడుతూ… కాంగ్రెస్ ప్రభుత్వం 2013 భూసేకరణ చట్టంను అమలు చేస్తున్నామని పచ్చి అబద్దాలు చెప్తూ మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టుపై వాస్తవాలను దాచిపెడుతున్నార‌ని మండిప‌డ్డారు.మూసీ బాధితులకు పునరావాసం విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్రాన్ని, దేశాన్ని తప్పుదోవ పట్టించడం సిగ్గు చేటైన అంశ‌మ‌న్నారు.ఇప్ప‌టికైనా రేవంత్ తీరు మార్చుకోవాల‌ని సూచించారు.