పాలస్తీనా ఆకలి చావులు ఇజ్రాయిల్ కు కావాల్సిందేనా..!
గాజాకు సాయం తీసుకుని బయలుదేరిన వీరుల ఓడను చుట్టుముట్టిన ఇజ్రాయెల్ సైన్యం….అలా ఎందుకు చేసింది.గాజా లోపలికి ఆహారం మానవతా సహాయం ను అనుమతించకుండా ఎందుకు ఇలా చేస్తోంది. 20 లక్షల పాలస్తీనా ప్రజల ఆకలి చావులతో చంపేయాలనే కుట్ర ఇజ్రాయిల్ చేస్తుందా. సముద్ర మార్గం ద్వారా మానవతా సహాయంను తీసుకువస్తున్న షిప్ లను సైతం ఇజ్రాయిల్ సైన్యం పేల్చి వేసింది. ప్రపంచ దేశాలన్ని ఖండించినట్లు ముసలి కన్నీళ్లు కారుస్తున్నాయే తప్ప…ఎవరూ సరైన చర్యలు తీసుకోవడం లేదు. దానితో ప్రపంచ ప్రఖ్యాత వాతావరణ కార్యకర్త గ్రేటా తoబర్జ్ గాజా మానవతా దృక్పదంతో ప్రజలకు నేనున్నానంటూ ధైర్యం చేసి ముందుకు వచ్చింది. మానవతా సహాయంను గాజాకు తీసుకువెళుతున్న షిప్ లో తానే స్వయంగా ప్రయాణిస్తూ గాజాకు ప్రయాణం మొదలు పెట్టింది. ఆమెతో “పారు గేమ్ ఆఫ్ త్రోన్స్” లోని నటుడు మరికొంత మంది ప్రాఖ్యాత కార్యకర్తలు ఉన్నారు.ఆమే ధైర్యానికి మెచ్చుకొని తీరల్సిందే. ఆకలి చావులే లక్యంగా చేసుకుని ఇజ్రాయిల్ చేస్తున్న ఈ కొత్త మారానకాండ దీని ద్వారా ప్రపంచానికి తెలుస్తాయి. ఇజ్రాయెల్ సైన్యం మడేలిన్ ఓడను చుట్టుముట్టింది. ఐనా దానిలోని కార్యకర్తలు లొంగిపోవడానికి నిరాకరిస్తున్నారు .ఫ్రీడమ్ ఫ్లోటిల్లా కూటమి సభ్యురాలు యాస్మిన్ అజార్ అంతర్జాతీయ సమాజంతో మాట్లాడుతూ…ఆరు ఇజ్రాయెల్ పడవలు మడేలిన్ ఓడను చుట్టుముట్టాయి . మరో రెండు పడవలు మా దగ్గరకు వస్తున్నాయి అంటూ తెలుపుతూ ఇజ్రాయెల్ సైన్యం ఓడ తిరిగి వెళ్లాలని నిర్ణయించుకోకపోతే దానిని స్వాధీనం చేసుకుంటుందని భావిస్తున్నారు.

