EMI కడతావా న్యూడ్ ఫోటోలు పెట్టమంటావా?
నాన్ బ్యాంకింగ్ రంగలో పుట్టగొడుకుల్లా వెలుస్తున్న లోన్ యాప్‌ల ఫైనాన్స్ సంస్థల బారీన పడి ఎంతో మంది ఆత్మహత్యలకు పాల్పడుతూ అర్ధాంతరంగా తనువులు చాలిస్తున్నారు.ఈ మధ్య కాలంలో ఇలాంటి సంస్థల ప్రతినిధుల వేధింపులు నిత్యకృత్యమయ్యాయి.ప్రధానంగా ఏపిలో ఈ తరహా బెదిరింపు,ఘటనలకు సంబంధించిన కేసులు అధిక సంఖ్యలో నమోదవుతున్నాయి.తాజాగా మరో ఘటన ఏపిలో చోటు చేసుకుంది. తిరుపతి జిల్లా సూళ్లూరు పేటకు చెందిన ఓ యువతి హైద్రాబాద్‌లో సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేస్తూ.. ఫినబుల్ అనే నాన్ బ్యాంకింగ్ సంస్థ నుంచి లోన్ తీసుకుంది.దీన్ని యాప్ ద్వారా పొంది ప్రతీ నెలా EMI చెల్లిస్తుంది.ఇలా 4 నెలల పాటు వరుసగా EMIలు చెల్లించింది.కానీ 5వ EMI చెల్లించలేదు.తాను అనారోగ్యానికి గురయ్యానని దాని కారణంగా చెల్లించలేకపోతున్నానని చెప్పినా సంస్థ ప్రతినిధులు వినలేదు.వేర్వేరు ఫోన్ నంబర్ల నుంచి రుణచెల్లింపుదారునికి కాల్స్ చేస్తూ EMI కట్టకపోతే సోషల్ మీడియాలో న్యూడ్ ఫోటోలు పెడతామని బెదిరించారు.అయినా యువతి రెస్పాండ్ అవ్వలేదు.దీంతో చిర్రెత్తిన ప్రతినిధులు…యువతి సోదరునికి న్యూడ్ ఫోటోలో పంపారు.తీవ్ర మనస్తాపానికి గురైన యువతి స్వగ్రామం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేసింది.దర్యాప్తు ప్రారంభించిన అధికారులు ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేసి రిమాండ్ కి పంపారు.