“అల్లు అర్జున్‌కు కూడా ఫ్యాన్స్ ఉన్నారా”?..జనసేన ఎమ్మెల్యే ఎద్దేవా
అల్లు అర్జున్‌కు కూడా ఫ్యాన్స్ ఉన్నారా, నాకు తెలియదే అంటూ జనసేన ఎమ్మెల్యే ఘాటు వ్యాఖ్యలు చేశారు. జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ, ఫ్యాన్స్ ఉండేది కేవలం చిరంజీవి మెగా ఫ్యామిలీకి మాత్రమే. అల్లు అర్జున్ తనకు ఫ్యాన్స్ ఉన్నారనుకుంటున్నారేమో నాకు తెలియదే అంటూ ఎద్దేవా చేశారు. తన స్థాయి మరచి అల్లు అర్జున్ మాట్లాడుతున్నారని మండి పడ్డారు. మేం పోటీ చేసిన 21 స్థానాలలో గెలిచాం. అతని అవసరం మాకు లేదు అంటూ ఎమ్మెల్యే మాట్లాడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అర్జున్ వచ్చినా రాకపోయినా మా పార్టీకి నష్టం లేదని, మెగా అభిమానులు అర్జున్‌లో చిరంజీవిని చూసుకుంటున్నారేమో అన్నారు. అంతేగానీ, అది అల్లు అర్జున్ గొప్ప కాదన్నారు. తన తండ్రి అల్లు అరవింద్‌నే ఎంపీగా గెలిపించుకోలేకపోయాడని ఎద్దేవా చేశారు.