దొడ్డి కొమురయ్య సేవలు అభినందనీయం:కేసీఆర్
తెలంగాణా సాయుధ పోరాటంలో ఎంతో మంది పాల్గొని ఎట్టకేలకు ప్రత్యేక తెలంగాణా రాష్ట్రాన్ని సాధించారు. కాగా ఈ రోజు ఆ సాయుధ పోరాట యోధుల్లో ఒకరైన దొడ్డి కొమురయ్య జయంతి. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్ ఆయనకు ఘన నివాళి అర్పించారు. ఆయన చేసిన త్యాగాలను సీఎం స్మరించుకున్నారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ..తెలంగాణా స్వయం పాలన ఆకాంక్షలకు కొమురయ్య ఊపిరిపోశారన్నారు. వారి ఆశయాల సాధనలోనే రాష్ట్రం ముందుకు సాగుతోందని తెలిపారు. అంతేకాకుండా అమరుల సంస్మరణార్థం నిర్మిస్తున్న అమరజ్యోతిని త్వరలోనే ప్రారంభిస్తామని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు.

