నెట్‌ఫ్లిక్స్‌లో రాజమౌళిపై డాక్యుమెంటరీ స్ట్రీమింగ్
దర్శక ధీరుడు ఎస్.ఎస్.రాజమౌళిపై నెట్‌ఫ్లిక్స్ రూపొందించిన డాక్యుమెంటరీ విడుదలైంది. మోడ్రన్ మాస్టర్స్ పేరుతో తీసుకొచ్చిన ఈ డాక్యుమెంటరీ తమిళ, హిందీ, ఇంగ్లీషు భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది. దీనికి సంబంధించిన ప్రోమోను నెట్‌ఫ్లిక్స్ పంచుకుంది. ఇందులో ఎన్టీఆర్, రామ్‌చరణ్, ప్రభాస్, రానా, హాలీవుడ్ దర్శకుడు జేమ్స్ కామెరూన్, బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహార్‌లు రాజమౌళిపై తమ అభిప్రాయాలను తెలియజేశారు.

