అమెరికా అధ్యక్షుడు బైడెన్ స్కిన్ క్యాన్సర్ గాయాన్ని తొలగించిన వైద్యులు
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, 80, ఫిబ్రవరిలో ఛాతీ నుండి క్యాన్సర్ చర్మ గాయాన్ని విజయవంతంగా తొలగించినట్లు వ్యక్తిగత వైద్యుడు శుక్రవారం తెలిపాడు. సాధారణ వైద్య పరీక్షలు చేస్తున్న సమయంలో కనుగొన్నామన్నాడు. బైడెన్‌కు వచ్చిన వ్యాధి బేసల్ సెల్ కార్సినోమా అని… ఇది శరీరమంతా వ్యాపించదని బైడెన్ వైద్యుడు కెవిన్ ఓ కానర్ చెప్పాడు. ఇందుకోసం బైడెన్ ఎలాంటి ట్రీట్మెంట్ కూడా తీసుకోనక్కర్లేదన్నాడు. ఫిబ్రవరి 16న బిడెన్ వార్షిక వైద్య పరీక్షల సమయంలో గాయం తొలగించామన్నాడు. రోజూ వారీ పనులను ఏం చక్కా చేసుకోవచ్చని కూడా సూచించాడు. బయాప్సీ సైట్ చక్కగా నయం చేయబడిందని… సమగ్ర ఆరోగ్య సంరక్షణలో భాగంగా చర్మ సంబంధమైన నిఘాను కొనసాగిస్తామన్నాడు. బేసల్ సెల్ కార్సినోమా సాధారణంగా “మెలనోమా, స్క్వామస్ సెల్ కార్సినోమా వంటి తీవ్రమైన చర్మ క్యాన్సర్లలా హానికరం కాదన్నాడు.

ఫిబ్రవరి చికిత్స తర్వాత అమెరికా అధ్యక్షుడిగా నిర్వహించాల్సిన అన్ని బాధ్యతలను బైడెన్ సంపూర్ణంగా చేసుకోవచ్చని… ఓ’కానర్ చెప్పాడు. 2024లో జరిగే ఎన్నికలకు తాను పోటీ చేస్తున్నట్లు ప్రకటించడానికి, అమెరికా అధ్యక్షుడిగా ఎన్నడూ లేనంత వృద్ధుడైన బైడెన్ ప్రకటనకు ముందు వైద్యులు పూర్తి ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు. ఫిబ్రవరి అపాయింట్‌మెంట్‌లో, బైడెన్ గత సంవత్సరం వాల్టర్ రీడ్ నేషనల్ మిలిటరీ మెడికల్ సెంటర్‌లో ప్రారంభమైన పరీక్షలన్నింటినీ విజయవంతంగా పూర్తి చేశాడు. ఈ ప్రాంగణం ప్రత్యేకంగా అమెరికా అధ్యక్షుడి కోసం వాషింగ్టన్ శివారులోని ఉంటుంది. బైడెన్ తన యుక్త వయసులో ఎక్కువ సమయం మండుటెండలో గడిపారని అందువల్ల ఆయనకు నాన్-మెలనోమా చర్మ క్యాన్సర్ ప్రమాదం వాటిల్లిందన్నాడు. అందుకే బైడెడన్ భాగంగా క్రమం తప్పకుండా చికిత్స పొందుతున్నాడని నివేదికలో వైద్యుడు రాశాడు.