Home Page SliderNationalNews

చేతిలో మెబైల్ ఫోన్‌ పెట్టి ఆపరేషన్ చేసిన వైద్యులు…

లక్నోకి చెందిన 56 ఏళ్ళ వ్యక్తి అయినటువంటి హరిశ్చంద్ర ప్రసాద్‌కి గత కొన్ని రోజులుగా విపరీతమైన తలనొప్పి, ఎడమ చెయ్యి, కాలు గుంజడం జరుగుతుంది. ఆసుపత్రికి వెళ్ళగా బ్రెయిన్ ట్యూమర్‌గా నిర్థారణ అయ్యంది. దాంతో ఆయనకు బుధవారం కళ్యాణ్ సింగ్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్‌లో ఆపరేషన్ జరిగింది. అయితే ఆ సమయంలో అక్కడి వైద్యులు, ఆ వ్యక్తి మెలకువగా ఉండి, నరాల నష్టం, ప్రమాదాలను తగ్గించడంలో సహాయపడటానికి తన మొబైల్‌ వాడనిచ్చారు. ఆపరేషన్ తరువాత పేషెంట్ పక్షవాతం బారిన పడకుండా కేవలం లోకల్ అనస్థేషియా ఇచ్చి కొద్ది సేపు మొబైల్ వాడడం, కాళ్ళు కదిలించడం, కాసేపు పెన్ పట్టుకోవడం వంటివి చేపించారు. వైద్యులు మేల్కొని క్రానియోటమీ టెక్నిక్‌ని ఉపయోగించి మెదడు కణితిని విజయవంతంగా తొలగించారు.ఈ వినూత్న విధానం చేతి, కాలు ఫంక్షన్‌లను సంరక్షించి, సురక్షితంగా కణితిని తొలగించడానికి సహాయమైంది.