Home Page SliderNationalNews

స్కూల్ ఓపెన్ చేస్తానన్న డాక్టర్

ప్రైవేట్ స్కూల్ ఫీజులపై ఏమాత్రం నియంత్రణ లేకుండా పోతోంది. భారీ ఫీజులతో తల్లిదండ్రుల జేబులు ఖాళీ చేస్తున్నారు స్కూళ్ల యాజమాన్యాలు. అలాంటి ఒక నర్సరీ స్కూల్ ఫీజుపై ఒక డాక్టర్ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. జగదీశ్ చతుర్వేది అనే వైద్యుడు తాను డాక్టర్ వృత్తి మానేసి, స్కూల్ ఓపెన్ చేస్తే మంచిదనుకుంటున్నానని కామెంట్లు చేశారు. ఒక ప్రైవేట్ స్కూల్‌లో నర్సరీ క్లాస్‌కి రూ.1.51 లక్షల రూపాయల ఫీజు ఉంది. దీనిలో రకరకాల ఛార్జెస్ ఉన్నాయి. వాటిలో పేరెంట్స్ ఓరియంటేషన్ ఫీజు రూ.8,400 ఉండడంతో ఈ ఫీజ్ రసీదును తన ఎక్స్ ఖాతాలో పోస్టు చేశారు. ఆ ఫీజులో ఇరవై శాతం కూడా డాక్టరుకు చెల్లించడానికి పేషెంట్లు ఇష్టపడరని, కానీ స్కూలుకు మాత్రం చెల్లిస్తారని సెటైర్ వేశాడు. దీనితో ‘విద్య, వైద్యం రెండూ దోపిడీకి మంచి మార్గాలేనంటూ’ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. ‘కాదేదీ దోపిడీకి అనర్హం’ అంటున్నారు.