NewsTelangana

రాష్ట్రాన్ని అగ్నికి ఆహుతి చేద్దామనుకుంటున్నారా?

కమలం పార్టీపై ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ మరోసారి తీవ్రంగా మండిపడ్డారు. తెలుగు భాషలో చెబుతూ ట్విట్టర్‌లో పోస్ట్‌ పెట్టారు. మునుగోడు ఉప ఎన్నిక కోసం బీజేపీ ఇంత బరితెగించాలా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ తీరు ఇప్పుడే ఇలా ఉంటే సార్వత్రిక ఎన్నికల నాటికి పరిస్థితి ఎలా ఉంటుందని ఆయన ప్రశ్నించారు. రాష్ట్రాన్ని అగ్నికి ఆహుతి చేద్దామనుకుంటున్నారా.. అని నిలదీశారు. హైదరాబాద్‌లో దుకాణాలు, పాఠశాలలు మూయించి ప్రజలను ఇళ్లలోనుంచి బయటకు రాకుండా కర్ఫ్యూ సృష్టించాలని అనుకుంటున్నారా? అని బీజేపీ నేతలను ప్రశ్నించారు. అల్లా దయతో ఇవన్నీ జరగకుండా ఉండాలని కోరుకుంటున్నానని అన్నారు. బీజేపీ సృష్టిస్తున్న హింసాకాండ నుంచి రాష్ట్రం విముక్తి పొందాలని ఆశిద్దామంటూ ఒవైసీ ట్వీట్‌ చేశారు.