నా పెళ్లాన్నే తిడతావా….
తన భార్య వ్యక్తిత్వాన్ని హననం చేశాడనే కోపంతో ఊగిపోయి హత్య చేసిన ఘటన సిరిసిల్ల పట్టణంలో కలకలం సృష్టించింది.సాధారణంగా భార్యాభర్తల్లో ఎవరో ఒకరి మీద ఇతరులు లేనిపోని మాటలు చెప్తే తొలుత అనుమానిస్తారు.కానీ ఈ ఘటనలో సీన్ రివర్స్ అయ్యింది. సుందరయ్యనగర్ కు చెందిన రమేష్, తంగళ్లపల్లి మండలానికి చెందిన మధుసూదన్ ఒకే చోట కూలీలుగా పనిచేస్తున్నారు .గత నెల 24న ఇద్దరు కలిసి మద్యం సేవిస్తున్న సమయంలో తన భార్య ఎవరితోనో ఫోన్ మాట్లాడుతుందని మధుసూదన్ రమేష్ తో చెప్పగా, అవును నీ భార్య మంచిది కాదు అని రమేష్ అన్నాడు.దీంతో కోపానికి గురైన మధుసూదన్, రమేష్ ను చెట్ల పొదల్లోకి తీసుకెళ్ళి బండరాయితో కొట్టి చంపేశాడు.తన భార్యను తన ముందే అనరాని మాటలు అన్నాడని దాంతో తానే ఈ హత్య చేశానని పోలీసుల ముందు నేరాన్ని అంగీకరించాడు.దీంతో నిందితుడు మధుసూదన్ ను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్ కు పంపారు.

