తీన్మార్ మల్లన్న తీస్మార్ ఖాన్ అనుకుంటున్నావా..?
ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నపై రాష్ట్ర డీజీపీకి తెలంగాణ రెడ్డి సంఘాల నేతలు పిర్యాదు చేశారు.వరంగల్ లో జరిగిన బీసీ సభలో తీన్మార్ మల్లన్న తీవ్ర పదజాలంతో రెడ్డి కులాన్ని దూషించడం పై ఆగ్రహం వ్యక్తం చేశారు. తీన్మార్ మల్లన్న పెద్ద తీస్మార్ ఖాన్ అనుకుంటున్నావా.. రెడ్లపై ఇష్టమొచ్చినట్టు మాట్లాడితే ఇక ఊరుకునేదంటూ నేతలు ఫైర్ అయ్యారు. మా రేవంత్ రెడ్డి.. తీన్మార్ మల్లన్నకు భిక్ష పెట్టి చాలా పెద్ద తప్పు చేశాడు. చిల్లర నుండి పెద్దగయి.. నీ సంగతి అంతా మాకు తెలుసు. చాయ్ పైసల్ అడుక్కునే నువ్వు బ్లాక్ మెయిల్ చేసుకుంటూ ఇవాళ హెలికాప్టర్ ఎక్కే స్థాయికి ఎదిగావు. తక్షణమే తీన్మార్ మల్లన్నను ఎమ్మెల్సీ పదవి నుండి సస్పెండ్ చేయాలని టీపీసీసీ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ కోరారు.

