Breaking NewsHome Page SliderPoliticsTelangana

“అమెరికా ధనిక దేశం ఎందుకో తెలుసా?”..కేంద్రమంత్రి

రోడ్లు బాగుంటేనే ఆ దేశాన్ని ధనికదేశంగా భావిస్తున్నామని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ పేర్కొన్నారు. అంతే కానీ అది ధనిక దేశం కాబట్టి రోడ్లు బాగున్నాయనేది నిజం కాదన్నారు. అందుకే కేంద్ర ప్రభుత్వం పీఎం సడక్ యోజన కింద దేశవ్యాప్తంగా రోడ్లు నిర్మిస్తోందన్నారు.  ఆదిలాబాద్ రావడానికి తాను ఎంతో ఇష్టపడతానని, ఈ జిల్లాకు ప్రత్యేక చరిత్ర ఉందని పేర్కొన్నారు. కుమురం భీం ఆసిపాబాద్ జిల్లా కాగజ్ నగర్‌లో ఆయన జాతీయ రహదారులను ప్రారంభించారు. రూ.3,900 కోట్ల విలువైన పనులను మొదలుపెట్టారు. రోడ్డు కనెక్టివిటీలో భాగంగా వంతెనలు, సొరంగమార్గాలు నిర్మిస్తున్నామని పేర్కొన్నారు. తెలంగాణ-మహారాష్ట్ర మధ్య రోడ్డు కనెక్టివిటీని పెంచుతామన్నారు.