Home Page SliderNational

‘చుట్టమల్లే’ పాటను పాడిన శిల్పారావు ఎవరో తెలుసా!

‘దేవర’ చుట్టమల్లే సాంగ్ ఛార్ట్‌బస్టర్ కావడంతో అది పాడిన శిల్పారావు ఎవరంటూ సంగీత ప్రియుల్లో ఆసక్తి పెరిగింది. శిల్ప తెలుగమ్మాయే కావడం విశేషం! తన తండ్రి వెంకట్రావు ఉద్యోగరీత్యా జంషెడ్‌పూర్‌లో సెటిల్ అయ్యారు. ‘వార్‌’లో గుంగ్రూ సాంగ్‌తో శిల్ప ఫిలింఫేర్ అవార్డు గెలుచుకున్నారు. ‘పఠాన్‌’లో బేషరం రంగ్, ‘జైలర్‌’లో కావాలయ్యా, ‘గుంటూరు కారం’లో ఓ మై బేబీ పాటల్ని ఆమే పాడారు. ఫొటోగ్రాఫర్ రితేష్ కృష్ణతో ఆమె పెళ్లి జరిగింది.