‘గణేశునికి 20 కేజీల బంగారు కిరీటం’..ఇచ్చిందెవరో తెలుసా?
ముంబైలో గణేశ్ ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతాయి. లాల్‌బాగ్ ప్రాంతంలో గణేశుని లాల్‌బాగ్చా రాజాకు అంబానీల చిన్నకుమారుడు అనంత్ అంబానీ, రాధిక దంపతులు 20 కేజీల బంగారు కిరీటాన్ని బహుకరించారు. దీని ధర తెలిస్తే కళ్లు తేలేయవలసిందే. ఈ బంగారు కిరీటం ధర రూ.15 కోట్లు ఉంటుందని తెలిసి సామాన్యప్రజలు షాక్ అవుతున్నారు. వినాయక చతుర్థి నాడు ప్రత్యేకపూజలు నిర్వహించి లాల్‌బాగ్చా గణేశునికి ఈ బంగారు కిరీటాన్ని అలంకరించారు. అంబానీల కుటుంబం ప్రతీ సంవత్సరం ఈ లాల్‌బగ్చా గణేశుని ఉత్సవంలో పాల్గొంటారు. అనంత్ రాధికల వివాహం ప్రపంచం నివ్వెరపోయేలా అంగరంగ వైభవంగా జరిగిన సంగతి తెలిసిందే. వీరి వివాహం తర్వాత మొదటి గణేశ్ చతుర్థి కావడంతో వీరిద్దరి చేతుల మీదుగా ఈ గణేశునికి కిరీటం అందించి పూజలు జరిపించారు అంబానీ కుటుంబం. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ కిరీటంపై చర్చ జరుగుతోంది. ఫొటోలు వైరల్ అవుతున్నాయి.

