ఆతిశీ టీచర్‌గా ఎక్కడ పని చేసారో తెలుసా?
ఢిల్లీ కొత్త సీఎంగా ఎన్నికైన ఆతిశీ గురించి ఇప్పుడు సోషల్ మీడియాలో వెదకుతున్నారు నెటిజన్లు. ఈ నేపథ్యంలో ఆమె గతంలో ఏపీలో టీచర్‌గా పనిచేసిన విషయం వెలుగులోకి వచ్చింది. ఆమె రాజకీయాలలోకి రాకముందు టీచర్‌గా పనిచేశారు. ఏపీలోని మదనపల్లె వద్ద రిషివ్యాలీ అనే స్కూల్‌లో ఆమె పనిచేసినట్లు తెలుస్తోంది. అనంతర కాలంలో ఆమె 2013లో ఆమ్ ఆద్మీ పార్టీలో చేరారు. ఆమె విదేశాలలో ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీలో పీజీ చేశారు. గతంలో విద్యాశాఖ మంత్రిగా పనిచేసిన మనీష్ సిసోడియాకు ఆమె సలహాదారుగా పనిచేశారు. తర్వాత కాలంలో ఎమ్మెల్యేగా గెలిచి, పార్టీలో కీలకమైన వ్యక్తిగా మారారు. ప్రస్తుతం విద్యాశాఖ మంత్రిగా పనిచేస్తున్నారు. ముఖ్యమంత్రి కేజ్రీవాల్ జైలులో ఉన్న సమయంలో పార్టీలో క్రియాశీలకంగా పనిచేశారు. ఢిల్లీ వరదల సమయంలో కూడా కేంద్రంతో సమన్వయం చేస్తూ బాగా పనిచేశారు. కేజ్రీవాల్ రాజీనామా చేయడంతో ఆమెను ఢిల్లీ ముఖ్యమంత్రిగా పార్టీ ఎన్నుకుంది. ఆమె మీడియాతో మాట్లాడుతూ తాను తాత్కాలిక ముఖ్యమంత్రినేనని, త్వరలోనే రాబోయే ఎన్నికలలో కేజ్రీవాల్ ముఖ్యమంత్రిగా ఎన్నికవుతారని ఆశాభావం వ్యక్తం చేశారు.

