అమరావతిలో మోదీ ఏం శంకుస్థాపన చేస్తున్నారో తెలుసా?
అమరావతి రాజధాని నగరం ఈసారి అన్‌స్టాపబుల్ అని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. ప్రధాని మోదీ చేతుల మీదుగా పలు ప్రాజెక్టులకు శంకుస్థాపనలు చేయిస్తున్నారు. అంతర్జాతీయ స్థాయిలో అమరావతి నగరాన్ని నిలపడానికి లక్షల కోట్ల రూపాయల ప్రాజెక్టులు ప్రారంభిస్తున్నారు. రాజధాని పనులు సహా రూ.58 వేల కోట్ల విలువైన ప్రాజెక్టులకు ప్రధాని మోదీ శ్రీకారం చుట్టబోతున్నారు. అమరావతిలో రూ.77,249 కోట్లతో 100 పనులు 11 కీలక ప్రాజెక్టులకు ప్రధాని శంకుస్థాపనలు చేస్తున్నారు. 217 చ.కి.మీ. పరిధిలో రాజధాని నిర్మాణం, 16.9 చ.కి.మీ. పరిధిలో కోర్ క్యాపిటల్, రాజధానిలో 9 థీమ్‌లతో 9 నగరాల నిర్మాణం, నార్మన్ పోస్టర్‌తో ముఖ్య కార్యాలయాల డిజైన్లు వంటి పనులకు నేడు అంకురార్పణ జరగబోతోంది.