Home Page SliderInternational

భారతదేశంలో అత్యంత ఖరీదైన సిటీ ఏంటో తెలుసా..?

ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన నగరం ఏంటో తెలుసుకోవాలని చాలామంది ఆసక్తి కనబరుస్తుంటారు.ఈ నేపథ్యంలో అలాంటి వారి కోసమే “కాస్ట్ ఆఫ్ లివింగ్ సిటీ ర్యాంకింగ్ 2024” జాబితా తాజాగా విడుదలైంది. ఈ జాబితాలో ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన నగరంగా “హంగ్ కాంగ్” ప్రథమ స్థానంలో నిలిచింది. ఆ తర్వాతి స్థానాల్లో సింగపూర్,జ్యూరిచ్ ఉన్నాయి. ఇక భారతదేశంలో అత్యంత ఖరీదైన నగరంగా దేశ ఆర్థిక రాజధాని ముంబై 136వ ర్యాంకుతో  అగ్రస్థానంలో నిలిచింది.  అయితే 2013 నుంచి ప్రారంభమైన ఈ సర్వేలో ముంబై నగరం గత 11 ఏళ్లుగా అగ్రస్థానంలో నిలుస్తూ వస్తోంది. ఆ తర్వాత స్థానాల్లో ఢిల్లీ 164వ ర్యాంకు,చెన్నై 189వ ర్యాంకు,బెంగళూరు 195వ ర్యాంకు,హైదరాబాద్ 202వ ర్యాంకుల్లో ఉన్నాయి.