టిప్పర్ లారీ ఢీకొడితే ఎలా ఉంటుందో తెలుసా…!
గన్నవరం మండలం చిన్న అవుటపల్లి ఆర్టీవో చెక్ పోస్ట్ సమీపంలో జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. అదుపుతప్పి రెండు లారీలు ఎదురెదురుగా ఢీకొన్నాయి.విజయవాడ నుండి ఏలూరు వైపు వెళుతున్న లారీని, చిన్న అవుటపల్లి వెస్ట్ బైపాస్ నుండి రాంగ్ రూట్లో అతివేగంగా వచ్చి ఏలూరు వైపు వెళుతున్న లారీని .. టిప్పర్ లారీ ఢీకొట్టడంతో ఈ ప్రమాదం సంభవించింది.మితిమీరిన వేగంతో వస్తున్న టిప్పర్ లారీ ఢీకొట్టడంతో … సరైన మార్గంలో ప్రయాణిస్తున్న లారీలోని డ్రైవర్ అదే క్యాబిన్‌లో ఇరుక్కుపోయాడు.డ్రైవర్ రెండు కాళ్లు విరిగిపోయాయి.టిప్పర్ డ్రైవర్ పరారీలో ఉన్నాడు.సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని ట్రాఫిన్‌ని క్రమబద్దీకరించారు.డ్రైవర్‌ని చికిత్స నిమిత్తం ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్నారు.