కృష్ణంరాజు ఆస్తుల విలువ వెయ్యి కోట్లా?
అనారోగ్య కారణాలతో కన్నుమూసిన రెబల్ స్టార్ కృష్ణంరాజు ఆస్తుల విలువ తెలిస్తే మన మతి పోతుంది. నటుడిగా కెరీర్‌ను ప్రారంభించిన ఆయన హీరోగా, విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా సుమారు 200 సినిమాలలో నటించారు. ఈయన 1940 వ సంవత్సరంలో ఏలూరు జిల్లా మొగల్తూరులో సత్యనారాయణ రాజు, లక్ష్మీదేవి దంపతులకు జన్మించారు. స్వతహాగా క్షత్రియులయిన కృష్ణంరాజుకు తండ్రి వారసత్వంగా మొగల్తూరులోని వందల ఎకరాల భూమి వచ్చింది. ఇప్పటికీ ఆభూముల వ్యవసాయ నిర్వహణను వారి సమీప బంధువులు చూసుకుంటూ ఉంటారు. ప్రస్తుతానికి వారికి కృష్ణంరాజు పేరిట ఒక రాజభవనం లాంటి ఇల్లు కూడా ఉంది.

చెన్నైలో సినిమాలు చేసేటప్పుడు అక్కడ నివాసం ఉండేటందుకు పలు ఆస్తులు కొనుగోలు చేశారు. తర్వాత సినీ పరిశ్రమ హైదరాబాద్ వచ్చిన తర్వాత కూడా ఖరీదైన పలు నివాస భవనాలు కొనుగోలు చేశారు. ఆయన చనిపోయేనాటికి నివాసం ఉంటున్న జూబ్లీహిల్స్ భవనం విలువ 20 కోట్ల రూపాయల వరకూ ఉంటుందని అంచనా. అంతేకాక హైదరాబాద్‌లో ఆయనకు పలు షాపింగ్ కాంప్లెక్సులు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. అప్పుడప్పుడు ప్రశాంతంగా గడపడానికి ఆయన మొయినాబాద్ దగ్గరలోని కనకమామిడి దగ్గరలో ఒక ఫామ్ హౌస్ కొనుగోలు చేశారు. ఆయన అంత్యక్రియలు కూడా అక్కడే జరిపారు. ఇక కార్ల విషయానికి వస్తే ఆయనకు కోటి రూపాయల విలువచేసే బెంజ్ కారు, 40 లక్షల ఫార్చునర్, 90 లక్షల వోల్వో కారు ఉన్నాయి.

ఎవరైనా ఇంటికి వస్తే భోజనం పెట్టకుండా పంపేవారు కాదట. ఆయన మొదటిభార్య సీతాదేవి అనారోగ్యంతో కన్ను మూయడంతో శ్యామలాదేవిని రెండో వివాహం చేసుకున్నారు. వీరికి ముగ్గురు కుమార్తెలు. ఆయన మొత్తం ఆస్తుల విలువ 1000 కోట్ల రూపాయల దాకా ఉంటుందని అంచనా. దానిని ముగ్గురు కుమార్తెలకు సమానంగా వీలునామా రాసారట. అలాగే తమ్ముడి కుమారుడైన ప్రభాస్‌కు కూడా తన తదనంతరం ఒక భవనం వచ్చేలా రాసినట్లు తెలుస్తోంది. ఇవన్నీ పూర్వికుల నుండి వచ్చినవి, స్వశక్తితో సంపాదించినవని తెలుస్తోంది.

