Home Page SliderNational

రామ్‌చరణ్-ఉపాసనల కూతురి పేరుకి అర్థం ఏంటంటే?

రామ్‌చరణ్-ఉపాసన దంపతులు దాదాపు 11 సంవత్సరాల తర్వాత ఓ పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చారు. అయితే ఈ మెగా ప్రిన్సెస్‌ రాకతో కొణిదెల ఫ్యామిలో సంబరాలు షురూ అయ్యాయి.మరోవైపు ఎన్నో ఏళ్ల తర్వాత కొణిదెల ఫ్యామిలీకి వారసురాలు రావడంతో పాపకు ఏం పేరు పెడతారనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. అయితే ఈ రోజు జరిగిన  మెగా ప్రిన్సెస్ బారసాల ఫంక్షన్‌లో ఈ ఉత్కంఠకు తెరపడింది.పాప పేరు klin kaara(క్లింకారా)konidelaగా రామ్‌చరణ్-ఉపాసన దంపతులు నిర్ణయించినట్లు ప్రకటించారు. కాగా లలితా సహస్ర నామం నుంచి ఈ పేరును తీసుకున్నట్లు మెగాస్టార్ చిరంజీవి వెల్లడించారు. మెగా ఫ్యామిలీ ఇవాళ పాప బారసాల ఫంక్షన్‌ను గ్రాండ్‌గా నిర్వహించారు. పాప తాతయ్య,నాయనమ్మ అయిన చిరంజీవి,సురేఖలు దంపతులు  పేరును పాప చెవిలో చెప్పారు.అయితే ఇవాళ మెగా ప్రిన్సెస్ బారసాల అని ప్రకటించడంతో ట్విటర్‌లో “మెగా ప్రిన్సెస్” ట్రెండింగ్‌లో కొనసాగుతోంది. లలితా సహస్రనామ నామం నుండి తీసుకోబడినది.. ‘క్లిన్ కార’ ప్రకృతి స్వరూపాన్ని సూచిస్తుంది.. దివ్యమైన తల్లి ‘శక్తి’ యొక్క అత్యున్నత శక్తిని నిక్షిప్తం చేస్తుంది .. మరియు దానికి శక్తివంతమైన రింగ్ మరియు వైబ్రేషన్ ఉంది ..మనమందరం చిన్నపిల్ల, లిటిల్ ప్రిన్సెస్ ఈ లక్షణాలను తన వ్యక్తిత్వంలోకి .. ఆమె పెరిగేకొద్దీ ఇమిడిస్తుందని ఖచ్చితంగా నమ్ముతున్నామని రామ్‌చరణ్ తెలిపారు.