వరుణ్‌తేజ్ “మట్కా” ఫస్ట్ లుక్ రిలీజ్ డేట్ తెలుసా?
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా మీనాక్షి చౌదరి అలాగే బాలీవుడ్ బ్యూటీ నోరా ఫతేహి హీరోయిన్స్‌గా దర్శకుడు కరుణ కుమార్ తెరకెక్కిస్తున్న భారీ పాన్ ఇండియా చిత్రం “మట్కా” గురించి అందరికీ తెలిసిందే. ఈ చిత్రం ఇంట్రెస్టింగ్ గ్యాంగ్‌స్టర్ కం పీరియాడిక్ డ్రామాగా తెరకెక్కుతూండడంతో వరుణ్‌తేజ్ కెరీర్‌లోనే ఈ చిత్రం భారీ బడ్జెట్‌తో తీస్తున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రం కోసం వరుణ్‌తేజ్ ఒక సరికొత్త మేకోవర్‌ని సిద్ధం చేయగా ఈ లుక్‌పై ఫస్ట్ లుక్ పోస్టర్ ఎప్పుడు రిలీజ్ చేస్తారో అనే విషయం ఇప్పుడు మేకర్స్ అనౌన్స్ చేశారు. మరి ఈ ఫస్ట్ లుక్‌ని రేపు ఆగస్ట్ 11న ఉదయం 11 గంటల 7 నిమిషాలకి రిలీజ్ చేస్తున్నట్టుగా కన్ఫర్మ్ అయింది. మరి దీనిపై కూడా ఒక ఇంట్రెస్టింగ్ ప్రీ లుక్ పోస్టర్‌ని జనంలోకి వచ్చింది. దీంతో రేపు రానున్న పోస్టర్‌పై మంచి ఆసక్తి నెలకొంది. ఇక ఈ చిత్రానికి జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తుండగా “హాయ్ నాన్న” నిర్మాణ సంస్థ వైరా ఎంటర్‌టైన్‌మెంట్స్ వారు నిర్మిస్తున్నారు.