భోజనం చేసిన తర్వాత నిమ్మరసం తాగడం వల్ల ఎన్ని లాభాలో మీకు తెలుసా ……
నిమ్మకాయ వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయని మనందరికీ తెలుసు. కానీ, మీరు భోజనం చేసిన తర్వాత కూడా లెమన్ వాటర్ తాగొచ్చునని నిపుణులు చెబుతున్నారు. నిమ్మకాయ మన శరీరంలోని అసిడిటీని కూడా తగ్గిస్తుంది. తిన్న వెంటనే నిమ్మరసం తాగటం వల్ల మీ జీర్ణక్రియ సాఫీగా సాగుతుంది. మీ జీర్ణక్రియ వేగాన్ని మెరుగుపరుస్తుంది. దీంతో మీకు జీర్ణ రసాలు, ఎంజైమ్‌ల ఉత్పత్తి పెరుగుతుందని పోషకాహార నిపుణులు తెలిపారు . నిమ్మకాయ లో విటమిన్ సి , యాంటీ ఆక్సిడెంట్లు వంటి రకరకాల పోషకాలు అధికంగా ఉంటాయి . దాని వల్ల మన శరీరానికి కావలసిన ఇమ్యూనిటీ పవర్ ను పెంచుతాయి, మరియు మన బాడీ లో pH స్థాయిని పెంచడాన్ని సహాయపడుతుంది. తిన్న వెంటనే లెమన్ వాటర్ ను తాగితే గ్యాస్ట్రిక్ యాసిడ్ సమస్యను తగ్గిస్తుంది. అలా చేయడం వల్ల చర్మం కూడా కాంతివంతంగా మారుతుంది.