Home Page SliderNational

ఇక్కడ చెట్లకు పెన్షన్ ఇస్తున్నారో తెలుసా..!

మీరు వృద్ధులకు, వితంతువులకు, శారీరక వికలాంగులకు, ప్రభుత్వ ఉద్యోగులకు అందించే పెన్షన్ల గురించి వినే ఉంటారు. కానీ చెట్లకు కూడా పింఛన్లు అందుతున్నాయని మీకు తెలిస్తే ఖచ్చితంగా మీరు ఆశ్చర్యపోతారు. అయితే .. ఓ చోట మాత్రం వయసు పైబడిన పాత చెట్లకు కూడా పెన్షన్ ఇస్తున్నారు. ఇలా వృక్షాలకు పెన్షన్ ఇచ్చేది ఎక్కడో కాదు, మన భారతదేశంలోనే. హరియాణా ప్రభుత్వం ‘ప్రాణ్ వాయు దేవతా యోజన’ పేరుతో ఓ పథకాన్ని ప్రవేశపెట్టింది. పాత చెట్లను జాగ్రత్తగా చూసుకోవడం ఈ పథకం ప్రధాన ఉద్దేశం. దీన్ని 2021వ సంవత్సరంలో ప్రపంచ పర్యావరణ దినోత్సవం(జూన్ 5) సందర్భంగా ప్రారంభించారు. 75 ఏళ్లు నిండిన చెట్ల సంరక్షణ కోసం యజమానికి ఇలా సంవత్సరానికి రూ.2,750 పెన్షన్ రూపంలో ఇస్తున్నారు. ఆ డబ్బును ఆ చెట్టు సంరక్షణకు మాత్రమే వినియోగించాలి.