Home Page SliderInternationalTrending Today

ఈ కుక్క సంపాదన ఎంతో తెలుసా..?

మనం నెలకు లక్ష సంపాదించడానికే నానా కష్టాలు పడతాం. కానీ అమెరికాలోని మిచిగాన్ ప్రాంతానికి చెందిన ఈ టక్కర్ అనే కుక్క సంవత్సరానికి ఏకంగా 8.27 కోట్లు సంపాదిస్తోంది. వినడానికి నమ్మేలా లేదు కదూ. కానీ ఇది నిజం.. డబ్బు సంపాదనలో కూడా అన్ని కుక్కల కంటే ఇది ముందుంది.

మిచిగాన్ లోనే నివసించే బడ్జిన్ అనే మహిళ.. కుక్కకు 2 ఏళ్ళ వయస్సు ఉన్నప్పుడు తెచ్చుకొని పెంచుకోవడం ప్రారంభించింది. దానికి టక్కర్ అని పేరు పెట్టి.. సోషల్ మీడియాలో వీడియోలు పోస్ట్ చేయడం మొదలు పెట్టింది. ఆ వీడియోలు చాలా వైరల్ కావడంతో.. ఈ పనేదో బాగుందని వీడియోలు పోస్ట్ చేయడం కంటిన్యూ చేసింది. దీంతో ఈ కుక్క ప్రపంచవ్యాప్తంగా ఫేమస్ అయిపోయింది. కుక్క టక్కర్ సోషల్ మీడియా అకౌంట్ లను ఫుల్ టైం మేనేజ్ చేయడానికి ఏకంగా తమ ఉద్యోగాన్ని విడిచిపెట్టింది బడ్జిన్. సోషల్ మీడియాలో దీనికి ఉన్న ఫాలోవర్స్ ను చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే. ఈ కుక్కకు 2.5 కోట్ల మంది ఫాలో అవుతున్నారు. టిక్ టాక్ లో 11.4 మిలియన్లు, యూట్యూబ్ లో 5.5 మిలియన్లు, ఫేస్ బుక్ లో 4.6 మిలియన్లు, ఇన్ స్టాగ్రామ్ లో 3.4 మిలియన్ల మంది ఈ టక్కర్ ని ఫాలో అవుతున్నారు.