జైలులో ఉన్న గ్యాంగ్ స్టర్ బిష్లోయ్ ఖర్చు ఎంత తెలుసా?
ప్రస్తుతం దేశంలో గ్యాంగ్ స్టర్ లారెన్స్ బిష్ణోయ్ పేరు మారుమోగుతోంది. జైలు శిక్ష అనుభవిస్తున్న బిష్ణోయ్ కు సంబంధించి ఆయన కుటుంబ సభ్యుడు ఒకరు సంచలన విషయాలు వెల్లడించారు. లారెన్స్ జైలులో ఉన్నప్పటికీ అతడి అవసరాల కోసం కుటుంబ సభ్యులు ఏదాదికి రూ. 40 లక్షలకుపైగా ఖర్చు చేస్తున్నారట. ఈ విషయాన్ని ఆయన బంధువు రమేశ్ బిష్ణోయ్ వెల్లడించారు. తమది తొలి నుంచి సంపన్న కుటుంబమేనని రమేశ్ తెలిపారు. వారికి తమ గ్రామంలో 110 ఎకరాల భూమి ఉన్నట్టు తెలిపారు. పంజాబ్ యూనివర్సిటీ నుంచి న్యాయ విద్యను పూర్తిచేసిన లారెన్స్ గ్యాంగ్ స్టర్ గా మారతాడని తాము ఊహించలేదన్నారు. అతడెప్పుడూ ఖరీదైన దుస్తులు, బూట్లు ధరించేవాడని గుర్తుచేసుకున్నారు.