Home Page SliderNational

మన దేశ సెక్యూరిటీ గురించి తెలుసా?

భారత దేశంలోని రాజకీయ నాయకులు, క్రీడాకారులు, మత పెద్దలు, కళాకారులు, వ్యాపారవేత్తలు, వివిఐపీలు, హై రిస్క్ వ్యక్తులకు సెక్యూరిటీ ఇవ్వబడుతుంది. అయితే వీరికి ఎలాంటి భద్రత ఇవ్వాలని దానిపై రాష్ట్రంలోని ఇంటెలిజన్స్ అధికారులు, హోం సెక్రటరీ, డైరెక్టర్ తో కూడిన కమిటీ నిర్ణయం తీసుకుంటుంది. తర్వాత కేంద్ర హోం మంత్రిత్వ శాఖ అధికారికంగా ఆమోదిస్తుంది.

మనదేశంలో మొత్తం 5 రకాల సెక్యూరిటీలు ఉన్నాయి..

  1. ఎక్స్ లెవల్ సెక్యూరిటీ. ఇది దేశంలో ఐదో భద్రత స్థాయి. ఇందులో ఇద్దరు ఆర్మీ పోలీస్ ఆఫీసర్లను సెక్యూరిటీగా నియమిస్తారు.
  2. వై లెవల్ సెక్యూరిటీ. ఇది నాల్గవ భద్రత స్థాయి. ఇందులో ఇద్దరు కమాండోలు, పోలీస్ సిబ్బంది మొత్తం 11 మంది ఉంటారు.
  3. జడ్ లెవల్ సెక్యూరిటీ. ఇది మూడో అతి పెద్ద స్థాయి. ఇందులో 5 గురు కమాండోలు పోలీసులతో కూడిన 22 మంది సిబ్బంది ఉంటారు.
  4. జడ్ ప్లస్ లెవల్ సెక్యూరిటీ. ఇది రెండో అత్యున్నత సెక్యూరిటీ లెవల్. ఇందులో 10 లేదా అంతకంటే ఎక్కువ మంది కమాండోలు పోలీసు అధికారులతో కలిపి 50 మంది సిబ్బంది ఉంటారు. ఇందులో ప్రతి కమాండో మార్షల్ ఆర్ట్స్ లో నిపుణులై ఉంటారు. ఈ సెక్యూరిటీలో బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని కూడా కేటాయిస్తారు.
  5. ఎస్.పి.జి. లెవల్ సెక్యూరిటీ. ఎస్.పి.జి. అంటే స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్. ఇది దేశంలోనే అత్యున్నత స్థాయి సెక్యూరిటీ. భారత ప్రధాని, మాజీ ప్రధానులు మరియు వాటి కుటుంబ సభ్యులకు ప్రపంచవ్యాప్తంగా ప్రతి చోట ఈ స్థాయి భద్రత కల్పిస్తారు. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ మరణించిన తర్వాత నుంచి దేశ ప్రధానమంత్రులకు ఈ స్థాయి భద్రత కల్పిస్తున్నారు.