గంటకు ఎంత మంది చనిపోతున్నారో మీకు తెలుసా?
ప్రతి నిమిషం ప్రపంచంలో ఏదో ఒక చోట ఎవరో ఒకరు చనిపోతూనే ఉంటారు. అనారోగ్యం కారణంగానో, ప్రమాదం కారణంగానో మరణిస్తూనే ఉంటారు. అయితే.. ప్రపంచవ్యాప్తంగా ఏడాదికి 56 మిలియన్లకు పైగా మరణాలు సంభవిస్తున్నాయని అంచనా. దీని ప్రకారం నెలకు 4.6 మిలియన్లు, రోజుకు 1.50 లక్షలు, గంటకు 6వేలు, నిమిషానికి 106, సెకనుకు ఇద్దరు జీవిడుస్తున్నారు. ఇందులో అత్యధికంగా చైనాలో గంటకు 1,221 మంది చనిపోతున్నారు. ఆ తర్వాత ఇండియా (1,069), అమెరికా (332), నైజీరియా(313), ఇండోనేషియా (238), రష్యా (198), పాకిస్థాన్ (181), జపాన్ (180) ఉన్నాయి.

