Home Page SliderNational

నిర్మలా సీతారామన్ అల్లుడు ఎంత గొప్పవాడో తెలుసా?

భారత ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కుమార్తె ‘వాజ్ఞ్మయి’ వివాహం ‘ప్రతీక్ దోషి’ అనే వ్యక్తితో  అత్యంత నిరాడంబరంగా బెంగళూరులోని నిర్మల సొంతఇంట్లో కొద్దిమంది సన్నిహితుల మధ్యలో జరిగిన విషయం తెలిసిందే. అతడెవరనే విషయం పై నెటిజన్లు శోధన మొదలు పెట్టారు. సాధారణంగా మంత్రుల ఇళ్లల్లో వివాహాలు ఆకాశమంత పందిరితో ప్రముఖుల కోలాహలాలతో అంగరంగ వైభవంగా జరుగుతాయి. అలాంటిది అత్యంత సామాన్యంగా ఈ వివాహం జరగడంతో అందరిలో అతడెవరో తెలుసుకోవాలనే ఉత్సుకత పెరిగింది.

నిర్మలమ్మ అల్లుడు ప్రతీక్ సాధారణ వ్యక్తి కాదు. సాక్షాత్తూ భారత ప్రధాని నరేంద్రమోదీకి కుడి భుజంగా తెరవెనుక వ్యవహరించే వ్యక్తి. గుజరాత్‌కు చెందిన ఈ ప్రతీక్, నరేంద్ర మోదీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నరోజుల నుండీ ఆయన కార్యాలయంలో కీలక వ్యక్తిగా పనిచేస్తున్నారు. ప్రస్తుతం ఈయన పీఎంవో ఆఫీసులో రీసెర్చ్ అండే స్ట్రాటజీలో జాయింట్ సెక్రటరీగా పనిచేస్తున్నారు. ప్రతీక్ సింగపూర్ మేనేజ్‌మెంట్ స్కూల్‌లో ఎంబీఏ చేశారు. ప్రచారాలకు, సోషల్ మీడియాలకు దూరంగా ఉండి, ప్రధానికి కళ్లూ, చెవులూ తానే అయి వ్యవహరిస్తారని సన్నిహితులు చెప్తున్నారు. ఈ విషయం తెలిసిన నెటిజన్లు నిర్మలమ్మ కీలక వ్యక్తినే అల్లునిగా చేసుకుందంటూ చెవులు కొరుక్కుంటున్నారు.