‘మోదీ లడ్డూ’ క్రేజ్ గురించి తెలుసా?
మోదీ లడ్డూ ఏంటని ఆశ్చర్యపోతున్నారా.. ఈ మోదీ లడ్డూ కు చాలా క్రేజ్ ఉంది. బిహార్ లోని సంజీవ్ శర్మ ఓ స్వీట్ షాప్ వ్యాపారి. ఆయనకు మోదీ అంటే ఎంతో అభిమానం. దీంతో మోదీ మొదటిసారి ప్రధానిగా బాధ్యతలు తీసుకున్నప్పుడు రాయల్ లడ్డూలకు ‘మోదీ లడ్డూ’ అని పేరు పెట్టాడు. ఈ లడ్డూలతో సంజీవ్ శర్మకు మంచి పేరు వచ్చింది. అయితే ఈ దీపావళికి మోదీ లడ్డూలను మరింత ప్రత్యేకంగా చేయాలనుకున్నాడు. అందుకనే దీపావళి సందర్భంగా తయారుచేసే లడ్డూలలో పవిత్రమైన గంగాజలాన్ని కలుపుతున్నట్లు ఆ వ్యాపారి పేర్కొన్నారు. దాదాపు పదేళ్లుగా ఈ విక్రయాలు చేస్తుడడం గమనార్హం.

