Home Page SliderNationalPolitics

దేవేంద్ర ఫడ్నవీస్ భార్య గురించి తెలుసా..?

మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ భార్య అమృత ఫడ్నవీస్ బాలీవుడ్ సింగర్. ఆమె తన భర్త కంటే ఎక్కువే సంపాదిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. మహాయుతి కూటమి విజయంలో ఆమె కూడా పాలు పంచుకున్నారు. ఎన్నికల ప్రచారంలో ఉత్సాహంగా పాల్గొన్నారు. తాజాగా ఫడ్నవీస్ ప్రమాణ స్వీకారంలో కూడా మెరిశారు. ఆమె నాగపూర్‌ నివాసి. బ్యాంకు ఉద్యోగినిగా, సింగర్‌గా ఆమె  కెరీర్‌ ప్రారంభమయ్యింది. అనంతరం రాజీనామా చేసి సోషల్ యాక్టివిస్ట్‌గా, సింగర్‌గా పూర్తి స్థాయిలో రాణించారు. చిన్నవయస్సు నుండే శాస్త్రీయ సంగీతం అభ్యసించారు. ప్రియాంక చోప్రా హీరోయిన్‌గా నటించిన ‘జై గంగాజల్’ మూవీలో ఆమె మొదటి సారి బాలీవుడ్‌లో పాడారు. ముంబయి రివర్ యాంథెమ్, ముంబై పోయిసర్, దహిసర్, ఓషివారా, మిథి అనే పాటలతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఫిర్‌ సే అనే మ్యూజిక్ వీడియోను రూపొందించి ఒక్కరోజులోనే 7 లక్షల వ్యూస్ సాధించారు. ఈ వీడియోలో అమితాబ్ బచ్చన్ కూడా ఉండడం విశేషం.