Home Page SliderNational

“యాంటీ స్లీప్ అలారం” గురించి మీకు తెలుసా?

మన దేశంలో ప్రతిరోజు ఎన్నో రోడ్డు ప్రమాదాలు జరుగుతూనే ఉంటాయి. కాగా ఈ రోడ్డు ప్రమాదాల బారినపడి ఎంతోమంది వాహనదారులు తమ ప్రాణాలు కోల్పోతుంటారు. ఈ నేపథ్యంలో ఈ రోడ్డు ప్రమాదాలను అరికట్టేందుకు కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నో రకాల రక్షణ,అవగాహన చర్యలు చేపడుతున్నప్పటికీ అవి ఫలించడం లేదు. వాహనాలు నడిపే వ్యక్తులు నిద్రమత్తుతో తూలుతున్నప్పుడు రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరిగే అవకాశాలున్నాయి. ఈ క్రమంలో రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌కు చెందిన విద్యార్థులు “యాంటీ స్లీప్ అలారం”ను తయారుచేశారు. ఈ అలారం వాహనం నడుపుతున్న డ్రైవర్ కళ్లు మూసుకుంటే ..సెన్సార్ ద్వారా బజర్ మోగిస్తుందని విద్యార్థులు తెలిపారు. అప్పటికీ డ్రైవర్ కళ్ళు తెరవపోతే కారు ఆగిపోతుందని దీనిని రూపొందించిన విద్యార్థులు వెల్లడించారు. దీని ద్వారా రోడ్డు ప్రమాదాలను కొంతవరకు అరికట్ట వచ్చని విద్యార్థులు అభిప్రాయం వ్యక్తం చేశారు.