Home Page SliderNational

కోడి కూర చేసిన ఘోరం

ఓ కోడి కూర తండ్రి కొడుకుల మధ్య వివాదానికి కారణమైంది. కాగా ఇందులో చివరకు కొడుకు ప్రాణాలు కోల్పోయాడు. అదేంటి కోడికూర తండ్రి చేతిలో కొడుకు చావుకు కారణమైందా అని ఆశ్చర్యపోతున్నారా? అవును ఇది అక్షరాల నిజం. అయితే ఈ ఘటన కర్ణాటకలోని దక్షిణ కన్నడ జిల్లాలో చోటు చేసుకుంది.  కాగా ఈ జిల్లాకు చెందిన షీనా అనే వ్యక్తి తన ఇంట్లో చికెన్ కర్రీ చేశాడు. అనంతరం  కర్రీని రుచి చూడాలని తన కుమారుడు శివరామ్(32)ను కోరాడు. అయితే శివరామ్ ఆ చికెన్ కర్రీని రుచి చూసేందుకు నిరాకరించాడు. దీంతో ఇద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలో కోపోద్రిక్తుడైన షీనా చెక్కతో తన కొడుకు శివరామ్‌ను గట్టిగా కొట్టాడు. కాగా దెబ్బ చాలా గట్టిగా తగలడంతో శివరామ్ అక్కడిక్కడే మృతి చెందాడు. దీనిపై షీనా చుట్టుపక్కల వారు పోలీసులకు సమాచారం అందిచ్చారు. సమాచారం అందుకున్న పోలీసులు హటాహుటిన ఘటనాస్థలానికి చేరుకుని తండ్రి షీనాను అదుపులోకి తీసుకున్నారు.