Home Page SliderNationalPolitics

‘శరద్ పవార్ ఫోటోలు ఉపయోగించొద్దు’..సుప్రీం ఆదేశాలు

 ఎన్‌సీపీ వ్యవస్థాపకుడైన శరద్ పవార్ ఫోటోలు, వీడియోలు ప్రస్తుత ఎన్నికల ప్రచారంలో ఉపయోగించవద్దని ఎన్‌సీపీ చీఫ్ అజిత్ పవార్‌కు సుప్రీంకోర్టు ఆదేశించింది. ఎన్సీపీ చీలిపోయిన కారణంగా అజిత్ పవార్ వర్గానికి మెజార్టీ ఎమ్మెల్యేలు ఉండడంతో పార్టీ చిహ్నం, ఎన్నికల గుర్తును వారే దక్కించుకున్నారు. గతేడాది ఎన్సీపీ నుండి మెజార్టీ ఎమ్మెల్యేలతో సహా బీజేపీ-షిండే సర్కారుకు మద్దతు ఇచ్చి డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు అజిత్ పవార్. దీనితో ఇక శరద్ పవార్ ఫోటోలు వినియోగించుకునే హక్కు వారికి లేదని కోర్టు పేర్కొంది. సొంతకాళ్లపై నిలబడమంటూ హితవు చెప్పింది.