NewsTrending Today

కామెంట్లు చేసే వెధవలను పెళ్లిచేసుకుంటే అమ్మాయిలకు నరకమే

సమంత, నాగచైతన్య విడాకులకు నువ్వే కారణమంటూ ఇప్పటికీ సింగర్ శ్రీపాద చిన్మయిని ట్రోల్ చేస్తూనే ఉన్నారు. సమంతకు మంచి ఫ్రెండ్ అయిన ఈ డబ్బింగ్ ఆర్టిస్ట్ కమ్ సింగర్ ఏవో కామెంట్లతో వార్తల్లో నిలుస్తూ ఉంటుంది. చిన్మయి ఫెమినిస్టు అని, అందువల్లే సమంతను  ప్రభావం చేసిందని, దానివల్లే సమంత విడాకులు తీసుకుందని విమర్శలు చేస్తున్నారు. తనకు వచ్చిన ట్రోల్స్‌ను షేర్ చేస్తూ ఇలా కామెంట్లు చేసే ఎదవలను పెళ్లి చేసుకోవద్దంటూ అమ్మాయిలను హెచ్చరించింది చిన్మయి. ఇటీవల దలైలామా ప్రవర్తనపై కూడా కామెంట్ చేసింది చిన్మయి. దీనితో వేరే దేశాల సంగతి నీకెందుకంటూ ట్రోల్స్ చేశారు. పిల్లలతో అలా ప్రవర్తించడం తప్పని జవాబిచ్చింది చిన్మయి.