ఏపిలో సినిమా టికెట్ల రేట్లు పెంచొద్దు
గేమ్ ఛేంజర్ సినిమా టికెట్ల రేట్లు పెంపుకు ఏపి సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే.ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేయాలని కోరుతూ ఏపి హైకోర్టులో పిల్ దాఖలైంది. తెలంగాణ ప్రభుత్వం ఈ విషయంలో ఖచ్చితత్వాన్ని ప్రదర్శిస్తుంటే ఏపి సర్కార్ ఎందుకు ఉదాశీనంగా ఉందని ప్రశ్నిస్తూ హైకోర్టులో వ్యాజ్యం వేసింది. సామాన్యులకు సినీ వినోదం దూరమయ్యే పరిస్థితులను తీసుకొస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో హైకోర్టు ముందుకు బుధవారం ఈ కేసు విచారణకు రానుంది.

