Breaking NewsHome Page SlidermoviesNationalPolitics

వాళ్ల‌ను అరెస్టు చేయొద్దు

దేశ వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించిన సంధ్య థియేట‌ర్ ఘ‌ట‌న‌కు సంబంధించిన నిందితులుగా ఉన్న మైత్రి మూవీస్ నిర్మాతలు రవిశంకర్, నవీన్‌ను అరెస్టు చేయొద్ద‌ని హైకోర్టు ఆదేశించింది. నిర్మాతలపై పోలీసులు కేసు నమోదు చేయ‌డంతో .. త‌మ‌పై న‌మోదైన‌ కేసును కొట్టివేయాలని హైకోర్టులో ఆ ఇద్ద‌రు నిర్మాత‌లు క్వాష్ పిటీషన్ వేశారు.విచార‌ణ అనంత‌రం కోర్టు ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణ కొరకు కౌంటర్ దాఖలు చేయాలని పోలీసులకు ఆదేశాలిచ్చింది. విచారణ రెండు వారాలకు వాయిదా వేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించింది.