రౌడీయిజాన్ని ప్రోత్సహించే సినిమాలకు అనుమతులు ఇవ్వొద్దు..
సినిమా రంగంలో మార్పు రావాల్సిన అవసరం ఉందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అభిప్రాయపడ్డారు. పుష్ప -2 సినిమా తొక్కిసలాట ఘటనలో కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న శ్రీతేజ్ ఇవాళ ఆయన పార్టీ నేతలతో కలిసి పరామర్శించారు. రౌడీయిజాన్ని ప్రోత్సహించే సినిమాలకు అనుమతులు ఇవ్వొద్దని ప్రభుత్వాన్ని కోరారు.

