Home Page SliderTelangana

కూకట్‌పల్లి టిక్కెట్ జనసేనకు కేటాయించొద్దు

హైదరాబాద్: నగరంలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయం వద్ద ఆ పార్టీకి చెందిన కూకట్‌పల్లి నేతలు ఆందోళన చేపట్టారు. పొత్తులో భాగంగా కూకట్‌పల్లి అసెంబ్లీ టిక్కెట్‌ను జనసేనకు ఇవ్వొద్దన్న డిమాండ్ బాగా వినిపిస్తోంది. జనసేనకు ఆ స్థానాన్ని కేటాయించి తమ ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయొద్దని దాన్ని కాపాడాల్సిన అవసరం ఉందన్నారు. కూకట్‌పల్లి స్థానాన్ని జనసేనకు కేటాయించడమంటే బీఆర్‌ఎస్‌కు మద్దతు పలకడం కిందే భావించాల్సి వస్తుందన్న విషయంపై కార్యకర్తలు ఆందోళన చేపట్టారు.