యానిమల్ లవర్స్ ఇలా కూడా చేస్తారా..?
యానిమల్ లవర్స్ పెంపుడు జంతువులను తమ ఫ్యామిలీలో వ్యక్తిలా చూసుకుంటారు. కొందరైతే బర్త్ డే సెలబ్రేషన్స్, శ్రీమంతం, చనిపోతే కర్మకాండ సైతం జరుపుతారు. ఇలాంటిదే ఒక వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఇంట్లోకి కొత్తగా తెచ్చుకున్న చిన్న కుక్కపిల్లకి మహిళ దిష్టి తీస్తోంది. ఆ కుక్కపిల్ల సైతం ఆమె చెప్పినట్లు శ్రద్ధగా కూర్చుని దిష్టి తీయించుకుంటుంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఫిదా అయిపోతున్నారు. ‘ఇలా కూడా చేస్తారా? నేనే అనుకున్నా… చాలా మందే ఉన్నారు బయట’ అంటూ ఓ నెటిజన్ ఎక్స్ వేదికగా ఈ వీడియోను పోస్ట్ చేశారు. ‘తెలుగు వాళ్లంటే.. సెంటిమెంటల్ పీపుల్, ప్రేమిస్తే ప్రాణం ఇచ్చేస్తాం.. అది మనిషి అయినా కుక్క అయినా.. తగ్గేదేలే’ అంటూ నెటిజన్ల పలు విధాలుగా స్పందిస్తున్నారు.