‘డీఎంకే పార్టీ గాజుల దొంగతనం’..అన్నామలై
తమిళనాడులోని కూనూరు మున్సిపాలిటీలో హిందీ వ్యతిరేక ప్రతిజ్ఞ చేస్తూ పక్కనున్న మహిళ గాజులు దొంగతనం చేయడానికి ప్రయత్నిస్తున్న డీఎంకే పార్టీ కౌన్సిలర్ వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేసింది బీజేపీ. ఈ వీడియో వైరల్ కావడంతో డీఎంకే పార్టీని, దొంగలను వేరు చేసి చూడలేం అంటూ వ్యాఖ్యానించారు బీజేపీ నేత అన్నామలై. హిందీ వ్యతిరేక ప్రతిజ్ఞ చేస్తున్న డీఎంకే కౌన్సిల్ జాకీర్ హుస్సేన్ చేస్తున్న పని అందరినీ నివ్వెరపరచింది. ఈ వీడియోలో జాకీర్ తన పక్కనున్న మహిళ చేతులకున్న గాజును లాగడానికి ప్రయత్నిస్తుండగా, పక్కనున్న మరో మహిళ జాకీర్ చేతిని నెట్టేసినట్లు కనిపిస్తోంది. దీనితో బీజేపీ నేతలు ఈ దృశ్యాలు వైరల్ చేస్తున్నారు.