Home Page SliderNational

డీకే శివకుమార్ సంచలన ప్రెస్ మీట్

కర్ణాటకలో సీఎం పదవిపై ఈ రోజు ఉదయం నుంచి  తీవ్రస్థాయిలో చర్చలు జరుగుతూనే ఉన్నాయి. అయినప్పటికీ కర్ణాటక సీఎం ఎవరు అనే దానిపై ఇంతవరకు ఎలాంటి స్పష్టత రాలేదు. దీంతో కర్ణాటక సీఎంగా ఎవరిని ఎన్నుకుంటారని సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.ఈ నేపథ్యంలో కర్ణాటక  కాంగ్రెస్ అధ్యక్షుడు డీకే శివకుమార్ ఈ విషయంపై  తన నివాసంలో తాజాగా మీడియా సమావేశం నిర్వహించారు. మీడియాతో డీకే మాట్లాడుతూ..సీఎం పదవిపై హైకమాండ్ తుది నిర్ణయం తీసుకుంటుందన్నారు. పార్టీ అధ్యక్షుడిగా కాంగ్రెస్ గెలుపు కోసం ఎంతో కష్టపడ్డానన్నారు. నా అధ్యక్షతన 135 మంది ఎమ్మెల్యేలను గెలిపించుకున్నానన్నారు. కాగా ఈ గెలుపుకి కాంగ్రెస్ నేతలంతా సహకరించారన్నారు. కర్ణాటకలో కాంగ్రెస్ నేతలందరినీ ఏకతాటి పైకి తీసుకు వచ్చానన్నారు. అంతేకాకుండా సిద్ధరామయ్యతో ఎలాంటి విభేదాలు లేవని.. కాబట్టే ఆయన నా పుట్టిన రోజు వేడుకల్లో పాల్గొన్నారని డీకే స్పష్టం చేశారు.