పార్టీ మార్పు ప్రచారంపై-ఇది ఫేక్ న్యూస్ అన్న డీకే అరుణ
పార్టీ మారుతున్నారంటూ జరుగుతున్న ప్రచారంపై బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ ఖండించారు.
హైదరాబాద్: పార్టీ మారుతున్నారంటూ జరుగుతున్న ఫేక్ న్యూస్ ప్రచారంపై బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు, మాజీ మంత్రి డీకే అరుణ ఖచ్చితంగా ఇది ఫేక్ ఆరోపణలన్నారు. తాను పార్టీ మారే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. అలాగే కాంగ్రెస్ పార్టీలో చేరే ప్రసక్తే లేదన్నారు. కాంగ్రెస్ నాయకులు మైండ్‌గేమ్ ఆడుతున్నారు. బీజేపీ అధిష్ఠానం నన్ను గుర్తించి జాతీయ ఉపాధ్యక్ష పదవి ఇచ్చింది. ప్రధాని మోదీ నాయకత్వంలో పనిచేసేందుకు అదృష్టంతో కూడి వచ్చిన ఆఫర్ అని ఈ ఆఫర్ వదిలి బయటికి వెళ్లనన్న డీకే అరుణ.

